ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 24, 2021 , 03:25:10

ఉద్యోగ సంఘాలు మద్దతివ్వాలి : కుసుమ

ఉద్యోగ సంఘాలు మద్దతివ్వాలి : కుసుమ

ములుగుటౌన్‌, జనవరి 23 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఉద్యోగ సం ఘాలు మద్దతివ్వాలని ఉద్యోగ సంఘాలను జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ కోరారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఉపాధ్యాయ, పెన్షనర్ల పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్ట్‌ ఐక్యవేదిక నాయకులతో ఆయన మాట్లాడారు. త్వరలో పీఆర్సీ ఉత్తర్వులు వెలువడనున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి, మేడారం ట్రస్ట్‌ బోర్డు చైర్మ న్‌ ఆలం రామ్మూర్తి, ములుగు పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌, విజయ్‌, వెంకటాపూర్‌ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కూరెల్ల రామాచారి, ఎంపీపీ బుర్ర రజిత, డీసీసీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ మాడుగుల రమేశ్‌, నాయకులు గండ్రకోట సుధీర్‌, పోరిక గోవింద్‌నాయక్‌, బుర్ర సమ్మయ్య, రవిరామన్‌, బొచ్చు సమ్మయ్య, విజ య్‌, రాజేందర్‌, రాము పాల్గొన్నారు.

గెలుపోటములు సహజం

వెంకటాపూర్‌, జనవరి 23 : ఆటలో గెలుపోటము లు సహజమని జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ అన్నా రు. మండల కేంద్రంలో ‘వెంకటాపూర్‌ ప్రీమియర్‌ లీగ్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంద న్నారు. వెంకటాపూర్‌లో మినీస్డేడియం, లక్ష్మీదేవిపేటలో జిమ్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రజిత, మేడారం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ అల్లం రామ్మూర్తి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కూరెళ్ల రామాచారి, సర్పంచ్‌ మేడబోయిన అశోక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ మాడుగుల రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కాసర్ల కుమారస్వామి, ఎంపీటీసీలు పోశాల అనిత, శ్రీలత, టీఆర్‌ఎస్‌ నాయకులు గోవింద్‌నాయక్‌, బుర్ర సమ్మయ్య, అంతటి రాము, రాజ్‌కుమార్‌, బొచ్చు సమ్మయ్య పాల్గొన్నారు.

VIDEOS

logo