Mulugu
- Jan 23, 2021 , 01:09:09
VIDEOS
సేవలు అభినందనీయం

గోవిందరావుపేట, జనవరి22: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఫార్మాసిస్టులు ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా వైద్యాధికారి అప్పయ్య అన్నారు. పస్రా పీహెచ్సీలో శుక్రవారం నిర్వహించిన ఫార్మాసిస్టుల సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన సేవలు అందిస్తూ సర్కార్ దవాఖానలకు వచ్చే ప్రజల మన్ననలు పొందాలన్నారు. అనంతరం ఫార్మాసిస్టుల రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బత్తిని సుదర్శన్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మాసిస్టు కందకట్ల శరత్‌బాబు, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING