ఆదివారం 07 మార్చి 2021
Mulugu - Jan 23, 2021 , 01:09:09

వ్యవసాయ పనుల్లో బాలకార్మికులు

వ్యవసాయ పనుల్లో బాలకార్మికులు

వాజేడు, జనవరి22: ఐసీడీఎస్‌ సీడీపీవో ముత్తమ్మ, ఐసీపీఎస్‌ సోషల్‌ వర్కర్‌ జ్యోతి శుక్రవారం ఆపరేషన్‌ స్మైల్‌ నిర్వహించి చింతూరు జీపీలోని లక్ష్మీపురం, గుమ్మడిదొడ్డి తదితర గ్రామాల శివారుల్లో వ్యవసాయ పనులు చేస్తున్న బాలకార్మికులను గుర్తించారు. మిర్చితోటల్లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన 21 మందికి పైగా బాలకార్మికులను గుర్తించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఐసీడీఎస్‌ సీడీపీవో ముత్తమ్మ తెలిపారు. ఎస్సై తిరుపతిరావు సంబంధిత రైతులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. బాలలతో పనిచేయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

VIDEOS

logo