Mulugu
- Jan 23, 2021 , 01:09:05
VIDEOS
ఏటూరునాగారంలో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి

ఏటూరునాగారం, జనవరి 22 : కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏటూరునాగారంలోనే ఏర్పాటు చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్‌కుమార్ కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం సంఘం సమావేశం నిర్వహించారు. మైదాన ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఏటూరునాగారం మండలం ముల్లకట్ట సమీపంలో 1071 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇక్కడ అనుకూలంగా ఉన్నందున యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి పొడెం బాబు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలం కిషోర్, జిల్లా నాయకులు శ్రీకాంత్, మోహన్‌రావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వాణియే మేటి..
- అలవాటైన నడకతో అవార్డుల పంట
- పెట్రోల్ బంకుల్లో కల్తీని సహించం
- పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే .. భారీ మూల్యం తప్పదు!
- ఉత్సాహంగాకదన రంగంలోకి..
- నగర దారులు వాహన బారులు
- పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
- పేదలకు అండగా ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం
- సభ్యత్వ నమోదులో సైనికుడిలా పనిచేయాలి
MOST READ
TRENDING