బుధవారం 03 మార్చి 2021
Mulugu - Jan 22, 2021 , 00:58:09

మెరుగైన వసతులు కల్పించేందుకు..

 మెరుగైన వసతులు కల్పించేందుకు..

  • పీహెచ్‌సీని  పరిశీలించిన ఎన్‌హెచ్‌ఎం  బృందం

వాజేడు, జనవరి, 21 : పీహెచ్‌సీల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ఎన్‌హెచ్‌ఎం బృందం జిల్లాలోని వాజేడు పీహెచ్‌సీని గురువారం పరిశీలించింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఎం జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి చిరంజీవి, జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌ వివరాలు వెల్లడించారు. వాజేడు పీహెచ్‌సీని సందర్శించిన ఎన్‌హెచ్‌ఎం కమిటీ హైదరాబాద్‌లోని రాష్ట్ర క్వాలిటీ అస్యూరెన్స్‌ సభ్యులకు వీడియో కాల్‌ ద్వారా పీహెచ్‌సీలోని సిబ్బందితో బృందం సభ్యులు చర్చించినట్లు తెలిపారు. నెల రోజుల్లో ఢిల్లీ నుంచి మరో బృందం పీహెచ్‌సీని సందర్శించనున్నట్లు వారు తెలిపారు. జాతీయ నాణ్యతా ప్రమాణాలకు ఎంపికైతే ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు వసతులు కల్పిస్తారని వారు వివరించారు.  

VIDEOS

logo