గురువారం 04 మార్చి 2021
Mulugu - Jan 20, 2021 , 00:21:27

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : జడ్పీ చైర్మన్‌

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : జడ్పీ చైర్మన్‌

ములుగు రూరల్‌, జనవరి 19 : టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి మండల అధికార ప్రతినిధులు కృషి చే యాలని జడ్పీ చైర్మన్‌, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. మంగళవారం ము లుగు మండల అధికార ప్రతినిధిగా నియమితుడైన ముడతనపల్లి మోహన్‌ జడ్పీ చైర్మన్‌ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గోవింద్‌నాయక్‌, గండ్రకోట సుధీర్‌యాదవ్‌, మాసిపెద్ది సత్యం, డీసీసీబీ డైరెక్టర్‌ మాడుగుల రమేశ్‌, వెంకటాపూర్‌ మండల అధికార ప్రతినిధి భద్రయ్య, మండల అధ్యక్షుడు రామాచారి, సురేందర్‌ పాల్గొన్నారు. 

అర్హులకే అంగన్‌వాడీపోస్టులు 

జిల్లాలో ఇటీవల ప్రకటించిన అంగన్‌వాడీ పోస్టులను అర్హులైన అభ్యర్థులకే కేటాయించనున్నట్లు జడ్పీ చైర్మన్‌ తెలిపారు. మంగళవారం జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  నియామకాలు రాజకీయాలకు, దళారీ వ్యవస్థకు అతీతంగా జరుగుతాయన్నారు. ప్రతిభ కలిగిన అభ్యర్థులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.  

 పొలం బాట పట్టిన జడ్పీ చైర్మన్‌

వెంకటాపూర్‌, జనవరి 19 : మండలంలోని కేశవాపూర్‌లో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌ స్వయంగా వెళ్లి పంటలను పరిశీలించారు. చిన్న, సన్న, మధ్యతరగతి రైతులకు దేవాదుల 3వ ఫేస్‌, రామప్ప-గణపురం చెరువుల అనుసంధానం కాలువల్లో భూములు కోల్పోయిన, కాలువకు అవతలి పక్కన ఉన్న భూముల సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు జడ్పీ చైర్మన్‌కు విన్నవించుకోగా  ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువపై వంతెన ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు మేలు జరిగేలా చూస్తానన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కూరెళ్ల రామాచారి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మాడుగుల రమేశ్‌, ఎంపీటీసీ తొగరి అశోక్‌, నాయకులు పోరిక గోవింద్‌నాయక్‌, బుర్ర సమ్మయ్య, గై అశోక్‌, బొచ్చు సమ్మయ్య, తాహీర్‌పాషా, వేల్పుల రాజబాబు, చల్పాల శ్రీనివాస్‌, మల్లయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo