శనివారం 27 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 19, 2021 , 01:17:51

నియమాలు పాటించాలి

నియమాలు పాటించాలి

  • ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ 

ములుగు, జనవరి18 (నమస్తే తెలంగాణ) : ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పని సరిగా పాటించాలని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ములుగు, ఏటూరునా గారం ఏఎస్పీలు సాయిచైతన్య, గౌస్‌ఆలంతో కలిసి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ నేటి నుంచి వచ్చే ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్‌ పెట్టుకోవడంతో పాటు లైసెన్స్‌, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి వేణు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. 

VIDEOS

logo