ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 19, 2021 , 01:17:53

శాఖల వారీగా జిల్లా ప్రగతి నివేదిక సమర్పించాలి : అదనపు కలెక్టర్‌

శాఖల వారీగా జిల్లా ప్రగతి  నివేదిక సమర్పించాలి : అదనపు కలెక్టర్‌

ములుగు టౌన్‌, జనవరి 18 : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాఖల వారీగా జిల్లా ప్రగతి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా విజ్ఞప్తులపై రోజువారీ సమీక్ష చేసి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు ప్రజల నుంచి 1,933 విజ్ఞప్తులు రాగా 1,417 పరిష్కరించగా మిగతావి పరిష్కారదిశలో ఉన్నాయన్నారు. అనంతరం తెలంగాణ కో ఆపరేటివ్‌ అధికారుల డైరీని అదనపు కలెక్టర్‌, డీఆర్వో రమాదేవి, సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమీక్షలో జడ్పీ సీఈవో ప్రసూనారాణి, డీఆర్డీవో పారిజాతం సీపీవో రవి, డీఎస్‌వో విజయ భాస్కర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

logo