వారియర్స్‌కు వ్యాక్సినేషన్

- కరోనా టీకా వేయించుకున్న వైద్య,
- పారిశుధ్య కార్మికులు
- వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన
- జడ్పీచైర్మన్లు, కలెక్టర్లు
ములుగు, జనవరి16 (నమస్తేతెలంగాణ) : కరోనా కష్టకాలంలో సేవలందించిన వైద్య సిబ్బందికి శనివారం వ్యాక్సినేషన్ చేశారు. దేశవ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్లో భాగంగా తొలి టీకాను కరోనా వారియర్స్‌గా పిలిచే పారిశుధ్య, వైద్య సిబ్బందికి అందజేశారు. ప్రభుత్వ దవాఖానలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న బల్గూరి కుమార్‌కు తొలి టీకా వేశారు. రెండో టీకాను డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్యకు వేశారు. కాగా, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్‌సురభి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి ప్రారంభించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభ ఉపన్యాసాన్ని వీక్షించారు. టీకా వేయించుకున్న ప్రతి ఒక్కరికీ ఎడమ చేతి బొటనవేలిపై సిరా గుర్తు పెట్టారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మధ్యాహ్నం వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించి టీకా వేస్తు న్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్, డీఆర్వో కూతాటి రమాదేవి, డీఆర్డీఏ పారిజాతం, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, సర్పంచ్ బండారి నిర్మల, ఎంపీటీసీ విజయ్‌రాంనాయక్, నాయకులు గండ్రకోట సుధీర్‌యాదవ్, గోవింద్‌నాయక్ పాల్గొన్నారు.
ఏటూరునాగారంలో జగదీశ్వర్
ఏటూరునాగారం, జనవరి 16 : కరోనా వైరస్‌ను అంతం చేయడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని దవాఖానలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐటీడీఏ పీవో హన్మంత్ కొండిబా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొదటి టీకాను ల్యాబ్ టెక్నీషియన్ మార్క భాస్కర్ తీసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రసూనరాణి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ పల్లా బుచ్చ య్య, జడ్పీ కో ఆప్షన్ వలియాబీ, ఎంపీపీ అంతటి విజయ, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, వైద్యులు రాహిల్, స్వాతి, గౌతం, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో ఫణిచంద్ర, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ దుర్గారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ పాల్గొన్నారు.
కృష్ణకాలనీ కారల్‌మార్క్స్ కాలనీలో...
కృష్ణకాలనీ, జనవరి 16 : జనవరి 16వ తేదీని చరిత్ర పుటల్లో బంగారు అక్షరాలతో లిఖించాల్సిన రోజు అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జే సుధార్‌సింగ్ అధ్యక్షతన కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మొదట ఓరుగంటి గోపికృష్ణకు (ఆరోగ్య కార్యకర్త) వ్యాక్సినేషన్ చేశారు. జాయింట్ కలెక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సుధార్‌సింగ్ మాట్లాడుతూ.. భూపాలపల్లి పీహెచ్సీలో 30మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగపద్మజ, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య, వైద్యులు డాక్టర్ రవికుమార్‌నాయక్, తహసీల్దార్ అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, 26వ వార్డు కౌన్సిలర్ హారిక, సీహెచ్ వో రాజయ్య, సిబ్బంది శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
చిట్యాల దవాఖానలో
చిట్యాల, జనవరి 16 : స్థానిక సివిల్ దవాఖానలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. సూపరింటెండెంట్ జీడీ తిరుపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ జూలూరి సాయి శ్రీనాథ్ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో, మండల ప్రత్యేకాధికారి శైలజ, జడ్పీటీసీ గొర్రెసాగర్, తహసీల్దార్ ఎండీ షరీఫ్, సర్పంచ్ పూర్ణ చందర్రావు, కో ఆప్షన్ సభ్యుడు రాజ్‌మహ్మద్, వైద్యులు సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
మహదేవపూర్‌లో ...
మహదేవపూర్, జనవరి 16: స్థానిక సామాజిక వైద్యశాల లో వ్యాక్సినేషన్‌ను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్‌ను మహదేవపూర్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్ వేయించుకున్నారు.