బుధవారం 27 జనవరి 2021
Mulugu - Jan 14, 2021 , 01:50:51

నేరస్థులను పట్టుకునేందుకే కార్డన్‌ సెర్చ్‌

నేరస్థులను పట్టుకునేందుకే కార్డన్‌ సెర్చ్‌

చిట్యాల, జనవరి 13 : ప్రజల్లో ధైర్యం, భరోసా కల్పించడంతోపాటు నేరస్థులను పట్టుకునేందుకు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు సీఐ సాయిరమణ తెలిపారు. మండలంలోని వెంకట్రావుపల్లి(సి) గ్రామంలో పోలీసులు బుధవారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి ఎస్సైలు వీరభద్రరావు, రమణరెడ్డి, మహేంద్రకుమార్‌తోపాటు 60 మంది పోలీస్‌ సిబ్బందితో కాలనీలలో ఇంటింటినీ తనిఖీ చేశారు. ఇళ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు పరిశీలించారు.  గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారిని దిగ్బంధించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. 


logo