సోమవారం 25 జనవరి 2021
Mulugu - Jan 14, 2021 , 01:50:49

16న కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ

16న కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ

చిట్యాల, జనవరి 13: ఈ నెల 16న తొలి విడుతగా కరోనా వ్యాక్సిన్‌  పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి సుధార్‌సింగ్‌ తెలిపారు. అందులో భాగంగా చిట్యాల సివిల్‌ దవాఖానలో వ్యాక్సినేషన్‌కు ముందస్తుగా చేసిన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడుతగా సివిల్‌ దవఖాన సెంటర్‌ పరిధిలో 88 మందిని వైద్య, ఇతర సిబ్బందిని గుర్తించామని, 16న వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వారు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట డీఎస్‌వో జయపాల్‌, ఫార్మాసిస్ట్‌ మల్లికార్జున్‌, స్టాఫ్‌నర్స్‌ రాణి, రమ్య, వైద్య సిబ్బంది ఉన్నారు.logo