శుక్రవారం 22 జనవరి 2021
Mulugu - Jan 13, 2021 , 01:44:40

వ్యాక్సిన్‌ శీతల స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలి

వ్యాక్సిన్‌ శీతల స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలి

  • ములుగు డీఎంహెచ్‌వో  అల్లెం అప్పయ్య
  • వైద్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అవగాహన

ములుగు, జనవరి12(నమస్తేతెలంగాణ): కొవిడ్‌ వ్యాక్సిన్‌ రవాణాతోపాటు నిల్వ ఉంచే క్రమంలో శీతల స్థితిని ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది గమనించి నిర్ణీత శీతల స్థితిలో వ్యాక్సిన్‌ను ఉంచాలని ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య అన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటలీజెన్స్‌ నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌పై డీఐవో డాక్టర్‌ శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి మంగళవారం హన్మకొండలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దవాఖానలకు సరఫరా అయిన వ్యాక్సిన్‌ను ఈవీఐఎన్‌ యాప్‌లో నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్యాంజాన్‌, వీసీఎన్‌ శివశంకర్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో ప్రత్యేక బెడ్స్‌

ఏటూరునాగారం, జనవరి 12: మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ఏర్పాటు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లను వైద్యశాల సూపరింటెండెంట్‌  సురేశ్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ఈనెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ప్రత్యేక భవనంలో ఈమేరకు వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత వికటిస్తే వెంటనే అత్యవసర చికిత్స అందించేందుకు వైద్యశాలలో రెండు పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

వ్యాక్సిన్‌ పంపిణీకి సన్నద్ధం

భూపాలపల్లి టౌన్‌, జనవరి 12: ఈనెల 16న కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 14 కోల్డ్‌చైన్‌ సెంటర్లను జిల్లా వైద్యశాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేయగా మూడు వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతగా ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు మొత్తం 2191 మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు పేర్లు నమోదు చేశారు. 16న వ్యాక్సిన్‌ పంపిణీకి తేదీ ఖరారు కావడంతో మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో డీఎంఅండ్‌హెచ్‌వో సుధార్‌సింగ్‌ జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్‌లకు మరోమారు శిక్షణ ఇచ్చారు. భూపాలపల్లి పీహెచ్‌సీ, చిట్యాల సీహెచ్‌సీ, మహాదేవ్‌పూర్‌ సీహెచ్‌సీలను వ్యాక్సినేషన్‌ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. అందులో పనిచేస్తున్న డాక్టర్లు, సూపర్‌వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఉదయం 9 గంటల నంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్‌ అందిస్తారు. మూడు సెంటర్లలో రోజుకు 30 మందికి వ్యాక్సిన్‌ అందిస్తారు. చిట్యాల, మహదేవ్‌పూర్‌ సూపరింటెండెంట్‌, భూపాలపల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు క్యాంప్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారని, వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత 30 నిమిషాలు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని డీఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు.


logo