గురువారం 04 మార్చి 2021
Mulugu - Jan 04, 2021 , 02:59:41

పడిపూజకు వెళ్లొస్తుండగా..కబళించిన మృత్యువు

పడిపూజకు వెళ్లొస్తుండగా..కబళించిన మృత్యువు

  • లారీ ఢీకొని బాలుడి దుర్మరణం

ములుగు రూరల్‌, జనవరి 3 : గురుస్వామి ఇంట్లో జరిగిన పడిపూజకు వెళ్లొస్తుండ గా.. జరిగిన రోడ్డు ప్రమా దం ఆ కుటుంబంలో తీరని శోకా న్ని నింపింది. ములుగు మం డలం జంగాలపల్లి పెట్రోల్‌ బంకు వద్ద ఆదివారం మ ధ్యాహ్నం లారీ, బైక్‌ ఢీకొని బాలుడు(కన్నెస్వామి) మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం మండలం కొర్నెపల్లి గ్రామానికి చెందిన బోదెబోయిన జ్ఞానప్రకాశ్‌ భార్య శోభారాణి గోవిందరావుపేట మండలం పస్రాలో బీట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నది. దీంతో వా రు పస్రాలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కాగా, జ్ఞానప్రకాశ్‌ తన సోదరుడు ప్రేమ్‌నాథ్‌తోపాటు ఇద్దరు పిల్లలు ఆర్యవర్ధన్‌(13), చరణ్‌తేజ నలుగురూ అయ్యప్ప మాలలు ధరించారు. ములుగు జిల్లా కేంద్రంలో రమేశ్‌ అనే గురుస్వామి ఇంట్లో జరిగిన పడిపూజలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. జ్ఞానప్రకాశ్‌ తన బైక్‌పై, ఇద్దరు కొడుకులు ప్రేమ్‌నాథ్‌ బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో జంగాలపల్లి పెట్రోల్‌ బంకు వద్ద ఏటూరునాగారం నుంచి ములుగు వైపు వస్తున్న లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుకాల కూర్చున్న ఆర్యవర్ధన్‌ లారీ టైర్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ్‌నాథ్‌, మధ్యలో కూర్చున్న చరణ్‌తేజ్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆర్యవర్ధన్‌(కన్నెస్వామి)మృతి చెందడంతో తోటి స్వాములతో పాటు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 


VIDEOS

logo