ఆదివారం 07 మార్చి 2021
Mulugu - Dec 31, 2020 , 02:45:30

ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

  • జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌

వెంకటాపూర్‌, డిసెంబర్‌ 30 : కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు అండగా ఉందని జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్‌ తపజుల్‌ హుస్సేన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, ఎంపీపీ బుర్ర రజిత, గై రుద్రమదేవితో కలిసి జడ్పీ చైర్మన్‌  39 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ పేద ఇంటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం గొప్పవరం అన్నారు.

 సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి 

సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని జడ్పీ చైర్మన్‌ అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో ఆయన సంక్షేమ పథకాలు, సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వెంకటాపూర్‌ మండలంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు త్వరలోనే పూర్తయ్యేలా చూస్తానన్నారు. మండల కేంద్రంలో మిషన్‌ భగీరథ నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌ మెడబోయిన అశోక్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకు రాగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే  స్థానిక పీహెచ్‌సీని జడ్పీ చైర్మన్‌ తనిఖీ చేశారు. వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి ఎంత మంది డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. రోజుకు ఎంత మందికి వైద్యం సేవలు అందిస్తునారు అనే విషయాలపై ఆరా తీశారు. డాక్టర్‌ వినయ్‌భాస్కర్‌ను దవాఖానలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ కార్యాలయంలో సింగరేణి ప్రాజెక్టు అధికారి రఘుపతి సిబ్బందితో కలిసి జడ్పీ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఓపెన్‌ కాస్టు కోసం చేపట్టే భూ సేకరణలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకుండా చూడాలని ఆయన వారికి సూచించారు. మండల కేంద్రంలోని రమణారెడ్డి తండ్రి రాజిరెడ్డి ఇటీవల మరణించగా అతని కుటుంబాన్ని, పాపయ్య పల్లి గ్రామంలో బొచ్చు సమ్మయ్య తల్లి సాంబలక్ష్మి మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్‌ ఆలెం రామ్మూర్తి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రామాచారి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌, నాయకులు గోవింద్‌ నాయక్‌, మల్క రమేశ్‌, బుర్ర సమ్మయ్య, గై అశోక్‌, ఆకిరెడ్డి రామ్మోహన్‌ రావు, తాహిర్‌ పాషా, బొచ్చు సమ్మయ్య, జూపాక రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వానికి ప్రజలకు వారథులు కార్యకర్తలు 

గోవిందరావుపేట : ప్రభుత్వానికి ప్రజలకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారధులని, వారి బాగోగుల కోసమే విస్త్రృత స్థాయి సమావేశాలు మండలాల వారీగా నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం మండలకేంద్రంలో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు మురహరి భిక్షపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్‌ కార్యకర్తల క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  మాట్లాడుతూ కార్యకర్తల సాధక బాదకాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి ఏకగ్రీవ నిర్ణయంతో సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రాబోయే రోజుల్లో రూ.5వేల కోట్లతో నామినేటెడ్‌ పనులు అందించబోతున్నట్లు తెలిపారు.  పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని, అలా ఎవరైనా  ప్రవర్తించినట్లయితే పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ సమావేశంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ ఆల్లెం రామ్మూర్తి, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్‌ పల్లా బుచ్చయ్య, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గోవింద్‌నాయక్‌, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

VIDEOS

logo