సిటీబ్యూరో, జూన్ 7(నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతికి అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టి వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేటకు చెందిన తమ్ము భరత్‌కుమార్ మల్కాజిగిరిలో ఉంటూ డిగ్రీ బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అశ్లీల వెబ్సైట్లు చూడటం అలవాటు చేసుకున్నా డు. ఈ క్రమంలో పలు వెబ్సైట్లలో కాల్‌బాయ్‌గా చెప్పుకుంటూ తన ఫోన్ నంబర్ అందులో పోస్టు చేశాడు. అక్కడి నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తవారితో పరిచయాలు చేసుకోవడం కోసం మొదలు పెట్టాడు.
ఇందులో భాగంగా ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యింది. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు.. ఈ క్రమంలో యువతి వ్యక్తిగత వివరాలు సేకరించి, ఆ తరువాత బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతడి బ్లాక్‌మెయిల్స్‌కు లొంగకపోవడంతో ఫేక్ ప్రొఫైల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ, బ్లాక్మెయిల్ చేసి డ బ్బులు కూడా డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భరత్‌కుమార్‌ను సోమవారం అరెస్ట్ చేశారు.