గురువారం 04 మార్చి 2021
Mulugu - Dec 20, 2020 , 02:28:46

పట్టుదలతో విజయం సాధించాలి : ఏఎస్పీ

పట్టుదలతో విజయం సాధించాలి : ఏఎస్పీ

ఏటూరునాగారం, డిసెంబర్‌ 19 : యువతను ప్రోత్సహించడంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ గౌస్‌ ఆలం అన్నారు. మండల కేంద్రంలోని కుమ్రంభీం స్టేడియంలో శనివారం యువజన క్రీడోత్సవాలను పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్పీ మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభను చూపాలని కోరారు. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. వాలీబాల్‌ 26 టీంలు, కబడ్డీ 14 టీంలు, ఆరు ఖో-ఖోటీంలతో పాటు మరో 20 మంది అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారు. అనంతరం సీఐ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మండలాల్లో గెలుపొందిన జట్లు వచ్చే నెలలో మేడారంలో జరిగే జిల్లా స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి, సర్పంచులు దొడ్డ కృష్ణ, ఈసం రామ్మూర్తి, వంక దేవేందర్‌, రమాదేవి, పీఈటీలు శ్రీనివాస్‌, సతీశ్‌, రమేశ్‌, రవి, శ్యామలత, స్వరూప, అవంతిక, రామయ్య, కుమారస్వామి, ప్రకాశ్‌, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. 

జీవితంలో క్రీడలు ఉపయోగకరం..

వెంకటాపూర్‌ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో గెలిచిన జట్లకు ఏఎస్పీ సాయిచైతన్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లడుతూ..  జీవితంలో క్రీడలు ఎంతో ఉపయోగకరమని, గ్రామీణ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ములుగు సీఐ దేవేందర్‌రెడ్డి,  సర్పంచ్‌లు అశోక్‌, సూర్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు, పోషాల వీరమల్లు, జనగాం రవీందర్‌, ఎస్‌ఐ డీ రమేశ్‌, ఉపాధ్యాయులు బాబురావు, సలేందర్‌, కోచ్‌ మామిడిపెల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo