లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కొద్దిరోజుల క్రితం మిల్కా సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ప్రస్తుతం ఆక్సిజన్ సాయంతో ఊపిరి తీసుకుంటున్నప్పటికీ
డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
‘కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మిల్కా సింగ్‌ను డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. న్యూట్రిషనల్, ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారని’ ఫోర్టిస్ హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. ఆక్సిజన్ అవసరం కావడంతో మిల్కా సింగ్ భార్య నిర్మలాను గత రాత్రే ఐసీయూకు
తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది.’