దివ్యాంగులను గౌరవిద్దాం

ములుగు కలెక్టరేట్: దివ్యాంగులను గౌరవించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభి అన్నారు. రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ, రాష్ట్ర సంక్షేమశాఖల సపంయుక్త ఆధ్వర్యంలో వెబ్‌నార్ ద్వారా అంతర్జాతీయ వికలాంగులు దినోత్సవాన్ని గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించారు. రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రెటరీ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ
వైకల్యం మనిషికి మాత్రమేనని, మనసుకు కాదని ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించాలన్నారు. అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి దివ్యాంగులతో కేక్ కట్ చేయించారు. దివ్యాంగుల విన్నపం మేరకు జిల్లాలో ప్రతి నెలా 4వ శనివారం దివ్యాంగులు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తానని, ఆర్టీసీ బస్‌పాస్ రెన్యువల్ జిల్లాలో ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతానని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆర్టీసీ బస్సుల్లో అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. స్వయం ఉపాధికి వారు సంఘాలుగా ఏర్పడి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం ఏదైనా బ్యంకు రుణం పొందేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఏ.పారిజాతం, డీడబ్ల్యూవో ప్రేమలత, వికలాంగుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి మాణిక్యం, శ్రీనివాస్, జిల్లాలోని దివ్యాంగులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..