సోమవారం 25 జనవరి 2021
Mulugu - Dec 04, 2020 , 03:21:10

అమరుల త్యాగ ఫలితమే ప్రత్యేక రాష్ట్రం

అమరుల త్యాగ ఫలితమే ప్రత్యేక రాష్ట్రం

ములుగు/కృష్ణకాలనీ,  డిసెంబర్‌3: తెలంగాణ మలిదశ పోరాటంలో ఉద్యమకారులు చేసిన ప్రాణ బలిదానం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌యాదవ్‌ అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో శ్రీకాంతాచారి చిత్రపటం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎంఏ సలీం, గరిగె రఘు, ఐలయ్య, కోటేశ్వర్‌, సారయ్య, జాగృతి నాయకుడు తిరుపతి, పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రీకాంతచారి వర్ధంతి టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం భూపాలపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి సెగ్గం దినేశ్‌, టీఆర్‌ఎస్వీ భూపాలపల్లి పట్టణ నాయకులు జడల రాజేశ్వరి, కొత్తపల్లి శంకర్‌, ఆకుదారి రాజేశ్‌, మధు, జడల రాజేశ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.logo