శనివారం 16 జనవరి 2021
Mulugu - Dec 03, 2020 , 01:25:03

కరోనా పరీక్షలు చేయించుకోవాలి

కరోనా పరీక్షలు చేయించుకోవాలి

ములుగురూరల్‌: కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లయితే ప్రజలు ప్రభుత్వ దావాఖానల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య అన్నారు. బుధవారం జంగాలపల్లి గ్రామంలో నిర్వహించిన అంగడిలో వ్యాపారులు, కొనుగోలుదారులకు డీఎంహెచ్‌వో మైక్‌ ద్వారా అవగాహన కల్పించారు. రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌, కలెక్టర్ల ఆదేశాల మేరకు కరోనా కరోనా పరీక్షల స్థాయిని పెంచి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పస్రా అంగడిలో, బుధవారం జంగాలపల్లి అంగడిలో కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు జిల్లాలో రోజూ 950 టెస్టులను నిర్వహించాల్సి ఉండగా బుధవారం 1227మందికి పరీక్షలను చేశామని అన్నారు. మొదటి రోజు 39 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వివరించారు.  రాయినిగూడెం వైద్యాధికారిణి జ్యోత్నాదేవి, వైద్య సిబ్బంది దుర్గారావు, తిరుపతయ్య ఉన్నారు.