గురువారం 21 జనవరి 2021
Mulugu - Nov 29, 2020 , 02:08:11

ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మహేశ్‌

ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మహేశ్‌

ములుగురూరల్‌: ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ జిల్లా కమిటీ సభ్యుడు నూనవత్‌ మహేశ్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ

తన ఎన్నికకు సహకరించిన జడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్‌, జడ్పీటీసీ సకినాల భవాని, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఎంపీటీసీ పోరం కన్వీనర్‌ వాసుదేవరెడ్డి, ములుగు జిల్లాలోని ఆయా మండలాల ఎంపీపీ లు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులకు దన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సం క్షేమ పథకాలను జిల్లా ప్రజలకు అందే విధంగా చూడటంతో పాటు ఎంపీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. 

ఉపాధ్యక్షుడిగా నర్సింహులు 

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఎంపీటీసీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని చెల్పా క ఎంపీటీసీ కోట నర్సింహులును ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటనలో తెలిపారు. నర్సింహులు ని యామకంపై ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేశారు.logo