శనివారం 16 జనవరి 2021
Mulugu - Nov 28, 2020 , 02:58:23

బాలల హక్కులపై అవగాహన

బాలల హక్కులపై అవగాహన

ములుగురూరల్‌:  జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు ఐసీపీఎస్‌ సోషల్‌ వర్కర్‌ జ్యోతి అన్నారు. శుక్రవారం జగ్గన్నపేట గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో బాల్య వివాహాలు, లైంగిక దాడులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వారి సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. బాలలపై లైగింక దాడులకు పాల్పడటం, వారికి బాల్య వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని తెలిపారు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథులుగా మిగిలిన వారిని గుర్తించి తమకు సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కు ఉల్లంఘనకు సంబంధించి 181, 1098 అనే టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అరుణ, అవుట్‌ వర్కర్‌ రాజు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.