గురువారం 28 జనవరి 2021
Mulugu - Nov 26, 2020 , 01:30:09

రైతులు కల్లాలను నిర్మించుకోవాలి

రైతులు కల్లాలను నిర్మించుకోవాలి

ములుగురూరల్‌, నవంబర్‌25: రైతులు వారి పొలాల్లో కల్లాలను నిర్మించుకోవాలని డీఏవో గౌస్‌హైదర్‌ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని దేవనగర్‌ గ్రామంలో రైతు కల్లాలు నిర్మించుకునేందుకు ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని  కల్లాలను నిర్మించుకొని ఆరబెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందుటూ ఉండవని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు కల్లాలను నిర్మించుకునేందుకు ఏఈవోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఏఈవో క్లస్టర్‌లో 50 కల్లాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఏవో సంతోష్‌, ఏఈవో సాయికుమార్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.  logo