గురువారం 28 జనవరి 2021
Mulugu - Nov 26, 2020 , 01:30:09

సరుకుల పంపిణీలో జాప్యం చేయొద్దు

 సరుకుల పంపిణీలో  జాప్యం చేయొద్దు

ములుగురూరల్‌, నవంబర్‌25: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు సరుకుల పంపిణీలో టీచర్లు జాప్యం చేయవద్దని, కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని డీడబ్ల్యూవో ఈపీ ప్రేమలత అన్నారు. మండలంలోని రాయినిగూడెం గ్రామంలో ఆమె బుధవారం అంగన్‌వాడీ టీచర్లతో సెక్టార్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే టీచర్లు, ఆయాలు సమయ పాలన పాటించాలని అన్నారు. సెంటర్లకు వచ్చే గర్భిణులు, బాలింతలు, ప్రీస్కూల్‌ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. సెంటర్ల పరిధిలో బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అ న్నారు. బాలలకు, మహిళలకు ఇబ్బందులు తలెత్తితే 101, 1098టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో సీడీపీవో దేవరశెట్టి లక్ష్మి, సూపర్‌వైజర్‌ అంజమ్మ, ఐసీపీఎస్‌ సోషల్‌ వర్కర్‌ జ్యోతి, అవుట్‌ వర్కర్‌ రాజు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.logo