ముచ్చటగా మూడు..

- లక్నవరంలో పూర్తయిన మరో సస్పెన్షన్ బ్రిడ్జి
- పర్యాటకుల రద్దీకి అనుగుణంగా నిర్మాణం
- నవంబర్ నెలలోనేఅన్ని ప్రారంభం ..
- టీఎస్ టీడీసీ ప్రత్యేక చొరవతో సుందరీకరణ పనులు
లక్నవరం సరస్సులో ముచ్చటగా మూడో వంతెన అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రెండు సస్పెన్షన్ బ్రిడ్జిలు ఉండగా ఇప్పుడు మరొకటి పూర్తయ్యింది. సాధారణ రోజుల్లోనే వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుండగా ఆదివారాలు, సెలవులప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో పర్యాటక శాఖ దీనిని ఏర్పాటుచేసింది. మూడు వంతెనలతో సరస్సు సరికొత్తగా కనిపిస్తుంది.
- గోవిందరావుపేట
లక్నవరం సరస్సుపై మూడో వేలాడే వంతెన పూర్తయ్యింది. రెండో ఐలాండ్ నుంచి మూడో ఐలాండ్ వరకు కొత్తగా వేసిన ఈ బ్రిడ్జిని కేవలం 15 రోజుల్లోనే నిర్మించారు. టీఎస్ టీడీసీ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో లక్నవరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుండగా పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అన్నీ నవంబర్లోనే..
లక్నవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2007లో మొదటి వంతెన నిర్మించారు. 2007 జూన్ 23న పనులు మొదలుకాగా నవంబర్ 30న అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. జూన్ 5న రెండో వంతెన పనులను ప్రారంభించగా, నవంబర్ 15న పర్యాటకలకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా 3వ వేలాడే వంతెన పనులను టీఎస్ టీడీసీ అధికారులు నవంబర్ 10న ప్రారంభించగా రికార్డు స్థాయిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తిచేశారు. సరస్సుపై నిర్మించిన మూడు వంతెనలు నవంబర్ నెలలోనే ప్రారంభించడం విశేషం. దీంతో లక్నవరంలో ముచ్చటగా మూడు వంతెనలు పర్యాటకులను మరింత కనువిందు చేయనున్నాయి.
తాజావార్తలు
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
- పని ఉందని తీసుకెళ్లి దోపిడీ..