బుధవారం 20 జనవరి 2021
Mulugu - Nov 25, 2020 , 06:50:56

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

గణపురం, నవంబరు24: మండలంలోని కర్కపల్లి గ్రామంలో మంగళవారం పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రైనీ ఐపీఎస్‌ అధికారి సుధీర్‌ రామ్‌ నాథ్‌ కేకాన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెంతల మంజుల(32)  రెండు నెలల క్రితం విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె చేతి వేళ్లు పూర్తిగా పని చేయడం లేదు. పనులు చేయరాకపోవడంతో మనస్తాపానికి గురై జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో రాసింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాలలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.logo