బుధవారం 20 జనవరి 2021
Mulugu - Nov 25, 2020 , 06:47:44

ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ములుగు కలెక్టరేట్‌, నవంబర్‌24: ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి ఏ.పారిజాతం అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ ఆంజనేయులుతో కలిసి ముద్ర రుణ మేళా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశానుసారం ములుగు వెంకటాపూర్‌ మండలాలకు చెందిన ఎస్‌బీఐ, యూబీఐ, కెనరా బ్యాంక్‌ అధికారులతో ముద్ర రుణ దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఏపీజీవీబీ బ్యాంక్‌ అధికారుల ద్వారా ఇవే మండలాల వ్యాపారుల నుంచి బుధవారం రుణ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో బ్యాంక్‌ అధికారులు సంతోష్‌, సీతారాం,  లాల్‌, దిలీప్‌, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాస్‌, డీపీఎం చౌహాన్‌ పాల్గొన్నారు.logo