శనివారం 28 నవంబర్ 2020
Mulugu - Nov 22, 2020 , 02:15:49

రైల్వేస్టేషన్‌ అభివృద్ధిని వేగిరం చేయాలి

రైల్వేస్టేషన్‌ అభివృద్ధిని వేగిరం  చేయాలి

  • ఏడీఆర్‌ఎం ప్రదీప్‌ సింగ్‌ 

డోర్నకల్‌: రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు వేగవంతం చే యాలని ఏడీఆర్‌ఎం ప్రదీప్‌సింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పోచారంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వేస్టేషన్‌ పనులు పరిశీలించారు. అనంతరం  డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. సీఎన్‌డబ్ల్ల్యూ 10, 11పాయింట్స్‌, రూ.2.5కోట్లతో నిర్మిస్తున్న నూతన రన్నింగ్‌ రూంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వేస్టేషన్‌ పరిసరాలు, బుకింగ్‌ రూంను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్‌ యూసీసీ మెంబర్‌ ఖాదర్‌ టికెట్‌ కౌంటర్‌ పరిసరాల్లో కొత్తగా రోడ్డు నిర్మించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, తర్వలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. ఆయన వెంట డీఈఎన్‌ సౌత్‌ సజ్జ, ఏడీఎన్‌ సుశాంక్‌,  రైల్వే మేనేజర్‌ కనకరాజు, ఏడీఏ, ఏఈ, ఐవోడబ్ల్యూలు పాల్గొన్నారు.