గురువారం 03 డిసెంబర్ 2020
Mulugu - Nov 22, 2020 , 02:16:01

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

తాడ్వాయి: మేడారంలోని జంపన్నవాగులో గల్లంతైన మంకుర్తి మహేశ్‌ (20) మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు కథనం ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మీనాజిపేటకు చెందిన మహేశ్‌కు  నెల రోజుల క్రితం పల్లవి అనే యువతితో వివాహం జరిగింది. ఈనెల 19న (గురువారం) మహేశ్‌ తన నలుగురు స్నేహితులతో కలిసి మేడారానికి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జంటవంతెనల వద్ద గల చెక్‌డ్యాంలోకి నలుగురు దిగారు. మహేశ్‌కు ఈత రాకపోవడం,లో తు, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయాడు.

స్నేహితులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా లా భం లేకుండాపోయింది. స్థానికుల స మాచారంతో పోలీసులు వాగు వద్దకు చేరుకొని వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. శుక్రవారం గజ ఈతగాళ్లతో గాలించగా రాత్రి మహేశ్‌ మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.