24 గంటల పాటు చైల్డ్‌లైన్ 1098 సేవలు

కృష్ణకాలనీ, నవంబర్ 13: బాలల సంరక్షణకు చైల్డ్‌లైన్-1098 రోజుకు 24 గంటలు పని చేస్తుందని చైల్డ్‌లైన్ 1098 కోఆర్డినేటర్ ఆర్ సుమన్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చైల్డ్‌లైన్ 1098 ద్వారా చైల్డ్‌లైన్ దోస్త్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతామని అన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బాలల వారోత్సవాల సందర్భంగా బాలలకు ఇండోర్ ఆటలు, డిజిటల్ డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. 18 ఏళ్లలోపు బాలికలు, 21 ఏళ్లలోపు బాలురకు ఉచిత సేవలు లభిస్తాయన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, తప్పిపోయిన బాలలు, బడిబయట బాలలు, లైంగిక వేధింపులకు గురైన బాలలు, రక్ష సంరక్షణ అవసరమున్న బాలలు ఉచిత సహాయ కోసం చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ టీం సభ్యులు విక్రమ్, కళావతి, రమ్య, తలసి, అనిత, హేమలత తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్