గురువారం 03 డిసెంబర్ 2020
Mulugu - Oct 30, 2020 , 02:24:21

యువత స్ఫూర్తిగా నిలుస్తున్నది

యువత స్ఫూర్తిగా నిలుస్తున్నది

  • మెగా రక్తదాన శిబిరంలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య 

ములుగు, అక్టోబర్‌ 29 : కరోనా కష్టంకాలంలో సై తం సాటి మనిషికి సాయం చేయాలనే గొప్ప ఆలోచనతో పోలీసులు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో పా ల్గొంటున్న యువత జిల్లా ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో ము లుగు డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మె గా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకురావాలన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా రక్తం అవసరం ఉ న్న జిల్లా ప్రజలకు తక్కువ ధరకు బ్లెడ్‌ అందించే ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ రక్తదానం చేసిన ఏఎస్పీ, పోలీస్‌ సిబ్బందికి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా ఇన్‌చార్జి ప్రసాద్‌రావు, సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి, ఎస్సైలు హరికృష్ణ, డీవీ ఫణి, రమేశ్‌, లయన్స్‌క్లబ్‌ సభ్యులు బలరాంరెడ్డి, చుంచు రమేశ్‌, రవీందర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, తోట రమేశ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. \                భూపాలపల్లి : పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వీ శ్రీనివాసులు అన్నారు. గురువారం పోలీస్‌ అమరవీరుల (పోలీస్‌ ఫ్లాగ్‌ డే) స్మరణ కార్యక్రమంలో భాగంగా  జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదా న శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ రక్తదానం చేసి ప్రారంభించారు. జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది, యువత, ప్రజలు  పాల్గొని  రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో పోలీసులు చేసే త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడం సాధారణ విషయం కాదని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ సదానందరెడ్డి, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, బోనాల కిషన్‌, శిక్షణ ఐపీఎస్‌ కేకన్‌ సుధీర్‌రామ్‌నాథ్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ భూపాలపల్లి చైర్మన్‌ డాక్టర్‌ కాశెట్టి శ్రీనివాస్‌, డాక్టర్లు ప్రధాన్‌, కోఆర్డినేటర్లు అరుణ్‌, రామకృష్ణ, ఆర్‌ఐలు సతీశ్‌, సంతోశ్‌, పోలీస్‌ అధికారుల సంఘం నేత శోభన్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.