గురువారం 03 డిసెంబర్ 2020
Mulugu - Oct 29, 2020 , 02:06:41

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

  • పెనుగోలు గ్రామస్తులతో కలెక్టర్‌ కృష్ణఆదిత్య

వాజేడు , అక్టోబర్‌ 28 : గుట్టలపై ఉంటున్న పెనుగోలు గిరిజన గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్‌ కృష్ణఆదిత్య అన్నారు. మండలపరిషత్‌ కార్యాలయంలో బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అభివృద్ధి పనుల జాప్యంపై కలెక్టర్‌ అధికారులను ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలో పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటిక , డంపింగ్‌యార్డు,  పల్లె ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెనుగోలులో ఎన్ని కుటుంబాలు ఉం టున్నాయి? అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎంత జనాభా ఉంటుంది ? అని కొంగాల జీపీ ప్రత్యే క అధికారి పుష్పవతి , కార్యదర్శి శిరీషను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌గుంటపల్లి, దూలపురం, ప్రగళ్లపల్లి గ్రామాలకు మిషన్‌భగీరథ ద్వారా నీరు ఎందుకు అం దించడంలేని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శైలజను ప్రశ్నించారు. అనంతరం పెనుగోలు గ్రామస్తులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. గుట్టలు దిగి వచ్చిన వారికి ప్రభుత్వ భూమి ఇచ్చేలా చూడాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో హన్మంతు కే జండగే, అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, తహసీల్దార్‌ సమ్మయ్య, ఎంపీడీవో కే చంద్రశేఖర్‌, ఎంఈవో తేజావత్‌ వెంకటేశ్వర్లు, ఎంపీవో సాజిదాబేగం,  ఎంపీపీ శ్యామల శారద, జడ్పీటీసీ తల్లడి పుష్పలత,  చెరుకురు ఎంపీటీసీ బీరబోయిన పార్వతి ,  సర్పంచులు పూసం నరేశ్‌, జెజ్జరి మేనక, సరళ, అనంతలక్ష్మి, కోరం సమ్మక్క, ఇర్ప సమ్మక్క, యాలం సరస్వతి, వాసం మల్లీశ్వరి, కోరం సాంబయ్య,  తెల్లం బుల్లేశ్వర్‌రావు, మడకం బెన్నిని, పూనెం నాగచంద్ర,  వాసం కృష్ణవేణి, తల్లడి ఆదినారాయణ, శివరామకృష్ణంరాజు, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నరేశ్‌, అశోక్‌, శిరీష, సరిత, ప్రవీణ్‌, లక్ష్మణ్‌, సురేశ్‌  తదితరులు పాల్గొన్నారు. 

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

వాజేడు పీహెచ్‌సీని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలపై వైద్యాధికారి యమునను అడిగి తెలుసుకున్నారు. కుక్క, పాముకాటు ఇంజిక్షన్లు అందుబాటులో ఉన్నాయా? అని ఆరాతీశారు.