బుధవారం 20 జనవరి 2021
Mulugu - Oct 29, 2020 , 02:06:41

రైతు వేదికలను పరిశీలించిన కలెక్టర్‌ అజీమ్‌

రైతు వేదికలను పరిశీలించిన కలెక్టర్‌ అజీమ్‌

రేగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలను బుధవారం కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, సుల్తాన్‌పూర్‌, చిన్నకోడెపాక, దమ్మన్నపేట, రేపాక, మడతపల్లి, భాగిర్తిపేట గ్రామాల్లో పనులను పరిశీలించి అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 25 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసహ నం వ్యక్తం చేశారు. ఈనెలా ఖరులోగా పనులు పూర్తి చే యకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌ వెం ట తహసీల్దార్‌ దివాకర్‌రెడ్డి, ఎంపీడీవో సురేందర్‌, పీఆర్‌డీఈ ఆత్మారావు, ఏఈ సతీశ్‌బాబు, సర్పంచులు అం బాల చందు, నడిపెల్లి శ్రీనివాసరావు, కుసుంబ రంజి త్‌ తదితరులు ఉన్నారు.

మొగుళ్లపల్లిలో..

మొగుళ్లపల్లి : మండలంలోని రంగాపురం, మొగుళ్లపల్లి, వేములపల్లి, ములుకలపల్లి, పర్లపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను బుధవారం కలెక్టర్‌ అజీమ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు త్వరగా పూర్తి చేయాలని సర్పంచులను ఆదేశించారు. వేములపల్లి, రంగాపురం గ్రామా ల్లో పనులు త్వరగా పూర్తి చేసినందుకు అభినందించారు. కలెక్టర్‌ వెంట ఆయా గ్రామా ల సర్పంచులు, అధికారులు ఉన్నారు. 


logo