బుధవారం 25 నవంబర్ 2020
Mulugu - Oct 28, 2020 , 02:02:36

పద్మాక్షీ దేవికి శాంతి కల్యాణం

పద్మాక్షీ దేవికి శాంతి కల్యాణం

వరంగల్‌ కల్చరల్‌, అక్టోబర్‌ 27 : హన్మకొండలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షీ దేవస్థానంలో మంగళవారం పద్మాక్షీ దేవికి శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు షణ్ముఖ అవధాని మాట్లాడుతూ ఆశ్వయుజ మాసం శరత్‌కాలంలో ప్రారంభం నుంచి అమ్మవారి ఆరాధన, తదుపరి కార్తీకమాసం శివారాధన చేయాలని శాస్త్రం చెబుతున్నట్లు తెలిపారు. ఆదిదంపతుల కల్యాణం ఆశ్వయుజ మాసం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా మహిషాసురుణ్ణి మదించి, మహిషాసురమర్దినిగా ఉగ్రరూపంలో ఉండే అమ్మవారిని శాంతింపజేసేందుకు శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు నాగిళ్ల శంకర్‌శర్మ, వేదపండితులు షణ్ముఖ అవధాని వెల్లడించారు. పద్మాక్షి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణానికి సేవకులుగా మోత్కూరి రామేశ్వర్‌, రాగిడి తిరుపతి, నాగరాజు, సుధాకర్‌ వ్యవహరించారు. కల్యాణానంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.