శుక్రవారం 27 నవంబర్ 2020
Mulugu - Oct 25, 2020 , 02:14:54

అభివృద్ధి పనుల పరిశీలన

అభివృద్ధి పనుల పరిశీలన

వెంకటాపురం (నూగూరు)  అక్టోబర్‌ 24: మండలంలోని పలు పం చాయతీల్లో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను శనివారం వెంకటాపురం జడ్పీటీసీ రమణ, నూగూరు ఏఎంసీ చైర్మన్‌ బుచ్చయ్య వేర్వేరుగా పరిశీ లించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు, శ్మశాన వాటిక నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్య లు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఆలుబాక సర్పంచ్‌లు పూజరి ఆదిలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష కార్యదర్శి గంపా రాంబాబు, పిల్లారసెట్టి మురళి పాల్గొన్నారు.  

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

మరిపెడ, అక్టోబర్‌ 24: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీటీసీ కొంపెల్లి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెంకంపాడుకు చెందిన బాధవత్‌ వీరన్న, చింతలగడ్డ తండాకు చెందిన అంగో తు కనకమ్మలకు  సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లు మంజూరైంది. కాగా,  శనివారం ఆయన లబ్ధిదారులకు చెక్కులను  అందజే శారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్‌ అలివేలు, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేశ్‌, చింతలగడ్డతండా మాజీ సర్పంచ్‌ తేజనాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రామలింగం, దేవేందర్‌, గోగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 రామప్పను దర్శించుకున్న ‘అనన్య దాస్‌గుప్తా’

వెంకటాపూర్‌, అక్టోబర్‌24: మండలంలోని పాలంపేటలో రామప్ప ఆలయాన్ని రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌ అనన్యదాస్‌ గుప్తా శనివారం కటుంబసభ్యులతో దర్శించుకున్నారు. రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన శిల్ప కళ సంపదను చూసి మంత్రముగ్దులయ్యారు.  ఆయన వెంట ఉమ్మడి వరంగల్‌ ఏకో టూ రిజం మేనేజర్‌ కల్యాణపు సుమన్‌ తదితరులు ఉన్నారు. 

మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు

కురవి : మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లోక కల్యాణార్థం ఆలయ ఈశాన్య దిక్కులో చండీహోమాన్ని ఘనంగా నిర్వహించారు. వేదపండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, లక్ష్మీగణపతి పూజలు నిర్వహించారు. హోమం చివరలో పూర్ణాహుతి కావించారు. హోమ భస్మం, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, శ్రీరాం ఓంప్రకాశ్‌, సిబ్బంది రవికుమార్‌, సమ్మయ్య, రాజశేఖర్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

డోర్నకల్‌ : మండలకేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రతిష్ఠిం చిన అమ్మవారు దుర్గా భవానీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మున్సిపల్‌ చైర్మన్‌ వీరన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయన వెట కౌన్సిలర్‌ పోటు జనార్దన్‌, సింధూశేఖర్‌ ఉన్నారు. 

గార్ల: మండలంలోని కోట్యానాయక్‌ తండా పరిధిలోని ముత్తి తండా లో ప్రతిష్ఠించిన దుర్గామాతకు సర్పంచ్‌ శ్రీనునాయక్‌, మాలా ధారణ గావించిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.