బుధవారం 02 డిసెంబర్ 2020
Mulugu - Oct 19, 2020 , 04:35:57

నిఘానీడలో ఏజెన్సీ

నిఘానీడలో ఏజెన్సీ

  • అణువణువూ   జల్లెడ పడుతున్న పోలీసులు
  • సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు
  • కొత్త వ్యక్తుల సంచారంపై ప్రత్యేక దృష్టి
  • మంగపేటలో ఎన్‌కౌంటర్‌తో కలకలం

మంగపేట : ఏజెన్సీ ప్రాంతంలో పోలీస్‌ శాఖ నిఘా ముమ్మరం చేసింది. మంగపేట మండల సరిహద్దు ప్రాంతంలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన క్ర మంలో అణవణువూ జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ప్రాంతాల్లో మా వోయిస్టుల అలజడి నేపథ్యంలో ఏజెన్సీలోని అట వీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా రు. సమస్యాత్మక గ్రామాలతో పాటు ఆయా కూ డళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల సంచారాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తాజాగా తనిఖీలు చేస్తున్న క్రమంలోనే మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యుడు చిన్న లక్ష్మయ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు గోదావరి పరీవాహక మండలాల్లో ఆవాసం ఏర్పరుచుకు న్న ఛత్తీస్‌గఢ్‌ వలస గొత్తికోయల గూడేలపై కూ డా నిరంతర నిఘా పెట్టారు. ప్రతి నిత్యం ఒక గూడేన్ని ఆయా మండలాల ఎస్సైలు తమ బలగాలతో వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. అంతకుముం దే వారి వివరాలు నమోదు చేసిన రిజిస్టర్‌లతో గూడేల్లోకి వెళ్లి, కొత్త వ్యక్తులెవరైనా వచ్చారా? అని ఆరా తీస్తూ కార్డన్‌సెర్చ్‌ చేస్తున్నారు.

ఎన్‌కౌంటర్‌ స్థలానికి తహసీల్దార్‌..

ఎన్‌కౌంటర్‌ స్థలం వదకద పంచనామా నిర్వహించేందుకు పోలీసులు మంగపేట తహసీల్దార్‌ బాబ్జీ ప్రసాద్‌ను తీసుకెళ్లినట్లు తెలిసింది. తాడ్వాయి-కాటాపురం గ్రామాల మీదుగా తహసీల్దార్‌ ను రహస్యంగా ఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ ప్రదేశంలో ఓ ఎస్‌ఎల్‌ఆర్‌, రైఫిల్‌ దొరికినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

 విధ్వంసం సృష్టించేందుకే వచ్చారు : ఎస్పీ

మంగపేట మండలంలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ తెలిపారు. మావోయిస్టు పార్టీ తెలంగాణలో విధ్వంసం సృష్టించేందుకు చాలా యాక్షన్‌ టీంలను మంగపేట, ఏటూరునాగారం ప్రాంతాలకు పంపారనే సమాచారం మేరకు జిల్లా స్పెషల్‌ పోలీస్‌, గ్రేహౌండ్స్‌ బలగాలతో అటవీ ప్రాంతా ల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేస్తుండగా ఎదురుకాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు మంగపేట మండలంలోని ఇతర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలతో పాటు తాడ్వాయి, పస్రా శివారు అడవుల్లో కూడా కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు. మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా నిత్యం పోలీస్‌ కూంబింగ్‌ చేస్తామని చెప్పారు.