శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mulugu - Oct 18, 2020 , 04:21:08

బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్‌ చేయూత

బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్‌ చేయూత

మంగపేట అక్టోబర్‌17: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నర్సింహసాగర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు, సహకార సంఘం డైరెక్టర్‌ కడారి రాజన్న కుటుంబానికి శనివారం టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ.2లక్షల నాలుగు వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఊడుగుల శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుడు కుంట ఏడుకొండలు, సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ కాడబోయిన నరేందర్‌, గ్రామ ప్రధాన కార్యదర్శి రేసు రమేశ్‌, అచంట శ్రీనివాసరావు, బెల్లి కుమార్‌, గౌని రమేశ్‌, రేసు కుమార్‌, కృష్ణ, అంకం రమేశ్‌, మల్లేశ్‌, సోమన్న, వెంకటేశ్‌, చిన్నవెంకన్న, బీ వెంకన్న, సాంబశివరావు, స్వామి, రమేశ్‌, నర్సయ్య, శ్రీను, రవి, శంకర్‌, ఎల్లయ్య, యాకన్న, మోహన్‌రావు పాల్గొన్నారు.