శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mulugu - Oct 18, 2020 , 04:21:08

‘మిలీషియా’ కమిటీ సభ్యుడి అరెస్ట్‌

‘మిలీషియా’ కమిటీ సభ్యుడి అరెస్ట్‌

  • భీమేశ్వర్‌రావు హత్య కేసులో మిడియం చిన్న లక్ష్మయ్య  నిందితుడు 
  • పేలుడు పదార్థాలు స్వాధీనం 
  • వివరాలు వెల్లడించిన  ఏఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

ఏటూరునాగారం : భీమేశ్వర్‌రావు హ త్య కేసులో నిందితుడు మిడియం చిన్న ల క్ష్మయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ము లుగు జిల్లా వెంకటాపురం మండలం ఆ లుబాక-కాండాపూర్‌ బ్రిడ్జి సమీపంలో శ నివారం ఉదయం పోలీసులు తనిఖీ చేస్తు న్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యుడు మిడియం చిన్న లక్ష్మయ్యను అ రెస్టు చేసినట్లు ఏఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అరెస్టయిన చిన్న లక్ష్మయ్యది వెంకటాపు రం మండలం తిప్పాపురం గ్రామం కాగా, ఈ నెల 10న మావోయిస్టు దళ సభ్యుడు దినేష్‌, పూజారి కంకేర్‌, ఆర్పీసీ మిలీషి యా బీ సెక్షన్‌ కమాండర్‌ కుర్సం సమ్మయ్యతో కలిసి చిన్న లక్ష్మయ్య ఆలుబాకకు చెందిన మడూరి భీమేశ్వర్‌రావు ఇంటికి వె ళ్లి పార్టీ ఫండ్‌ ఇవ్వాలని కోరారు. భీమేశ్వర్‌రావు నిరాకరించడంతో తుపాకీతో కా ల్పులు జరిపారు. గురి తప్పడంతో కత్తుల తో పొడిచి చంపారని ఏఎస్పీ తెలిపారు. అక్కడినుంచి మావోయిస్టులు జిన్నల రేవు వాగువైపు పారిపోగా అప్పటినుంచి చిన్న లక్ష్మయ్య భయంతో ఇంట్లోనే ఉంటున్న ట్లు పేర్కొన్నారు. వారం తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో శనివారం ఉదయం చిన్నలక్ష్మయ్య నడుచుకుంటూ చర్ల వైపు వెళ్తుండగా కొండాపూర్‌ శివారులో ఎస్సై తిరుపతి, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు వాహనా లు తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టుబడిన ట్లు తెలిపారు.

అతడిని విచారించగా తన పొలంలో దాచి పెట్టిన కార్డెక్స్‌ వైరు, రెండు జిలెటిన్‌ స్టిక్స్‌, రెండు టిఫిన్‌ బాక్సులు, రెం డు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏ ఎస్పీ వివరించారు. మూడేళ్లుగా చిన్న లక్ష్మ య్య మిలీషియా సభ్యుడిగా పనిచేస్తూ మావోయిస్టులకు నిత్యావసరాలు అందజేస్తున్నాడని, గ్రామానికి వచ్చినపుడు భోజ నం ఏర్పాటు చేస్తున్నాడని, పోలీసుల కదలికలను చేరవేస్తున్నాడని తెలిపారు. గతేడాది జూన్‌లో వాజేడు, వెంకటాపురం ఏ రియా కమిటీ సెక్రటరీ సుధాకర్‌ ఆదేశాల మేరకు కుర్సం రమేశ్‌, చిన్న లక్ష్మయ్య పో లీసులను చంపేందుకు కొత్త కార్డెక్స్‌ వైపు రెండు టిఫిన్‌ బాక్సులు తీసుకుని కొత్తపల్లి క్రాస్‌కు వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. వస్తువులను సీజ్‌ చే సి చిన్న లక్ష్మయ్యను రిమాండ్‌ చేసినట్లు ఏ ఎస్పీ పేర్కొన్నారు. వెంకటాపురం సీఐ శివప్రసాద్‌, ఎస్సై తిరుపతిరావు పాల్గొన్నారు.