గురువారం 22 అక్టోబర్ 2020
Mulugu - Oct 17, 2020 , 02:39:44

వైద్య సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి

వైద్య సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి

ములుగు, అక్టోబర్‌16: జిల్లాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బందితో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేపడుతూ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని కొనసాగించాలని అన్నారు. కొవిడ్‌ బాధిత వ్యక్తులకు సూచనలు ఇస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, కేసీఆర్‌ కిట్లను అందించాలని సూచించారు. గ్రామాల్లో గర్భిణుల వివరాలను ఏఎన్‌ఎంలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని అన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఫండ్స్‌ను అవసరం మేరకు వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలని అన్నారు. సమావేశంలో టీబీ నియంత్రణ అధికారి రవీందర్‌, వైద్యులు ఎం. వెంకటేశ్వర్లు, శ్యాంసుందర్‌, అరుణాదేవి, పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. logo