గురువారం 26 నవంబర్ 2020
Mulugu - Oct 04, 2020 , 02:04:51

రైతు వేదికల నిర్మాణ పనుల పరిశీలన

రైతు వేదికల నిర్మాణ పనుల పరిశీలన

డ్వాయి, అక్టోబర్‌03: రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య అన్నారు. మండలకేంద్రంతోపాటు మండలంలోని నర్సాపురంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను శనివారం ఆయన ఏటూర్‌నాగారం ఆత్మ చైర్మన్‌ దుర్గం రమణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, నాయకులు మురళి, దిడ్డి మోహన్‌రావులతో కలిసి పరిశీలించారు.