గురువారం 29 అక్టోబర్ 2020
Mulugu - Oct 02, 2020 , 02:29:49

ఆసరా పింఛన్లు విడుదల

ఆసరా పింఛన్లు విడుదల

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ములుగు జిల్లాలో 35, 809 మంది లబ్ధిదారులు 
  • పంపిణీకి అధికారుల సన్నాహాలు 

ములుగు, నమస్తే తెలంగాణ :  రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ  బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ములుగు జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలోని 174  గ్రామ పంచాయతీల్లో 35,809 మంది లబ్ధిదారులు పింఛన్లు అందుకుంటున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌ డబ్బులను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నోట్‌ ఫైల్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆసరా పింఛన్ల విభాగం అధికారులు జిల్లా కలెక్టర్‌ ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. 

పింఛన్‌దారుల కేటగిరి     సంఖ్య             మంజూరు చేసిన(రూ.)

వృద్ధాప్య                        13,663     2,75,44,608

వితంతువు                     16,182     3,26,22,912

చేనేత కార్మికులు                 195     3,93,120

గీత కార్మికులు                    230     4,63,680

బీడీ కార్మికులు                     90          1,81,440

ఒంటరి మహిళలు                 1,471          29,65,536

దివ్యాంగులు                             979        1,19,93,670

మొత్తం                                 35,809      7,61,64,966logo