శనివారం 31 అక్టోబర్ 2020
Mulugu - Oct 02, 2020 , 02:22:54

బొగతలో పర్యాటకుల సందడి

బొగతలో పర్యాటకుల సందడి

  • సుమారు ఆరు నెలల తర్వాత సందర్శనకు అనుమతి 

వాజేడు, అక్టోబర్‌ 1 : తెలంగాణ నయాగరా బొగత జలపాతం వద్ద మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది. కొవిడ్‌ నేపథ్యంలో సుమారు ఆరు నెలల నుంచి సందర్శన నిలిపి వేశారు. కాగా, ప్రభుత్వ అనుమతితో గురువారం ఎఫ్‌ఆర్వో శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలో  గేట్లు తెరిచారు. పర్యాటకులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అందాల జలపాతాన్ని తిలకించారు. బీట్‌ ఆఫీసర్‌ గొంది నారాయణ, అటవీశాఖ అధికారులు, బొగత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.