బుధవారం 28 అక్టోబర్ 2020
Mulugu - Oct 02, 2020 , 02:22:54

ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరం

ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరం

ములుగు కలెక్టరేట్‌ :  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమో దు ములుగు జిల్లా కో ఆర్డినేటర్‌ పోరిక గోవింద్‌ నాయక్‌, మండల ఇన్‌చార్జి మసరగాని వినయ్‌కుమార్‌ రెండు వేల ఫారాలను గురువారం తహసీల్దార్‌ సత్యనారాయణకు అందజేశారు. టీఆర్‌ఎస్‌  అభిమానులు, కార్యకర్తలు ఓటరుగా నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌ యాదవ్‌, జడ్పీటీసీ సకినాల భవాని ఓటరుగా తమ పేరును నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు విజయ్‌రామ్‌నాయక్‌, నాయకులు గడ్డమీది భాస్కర్‌, మహేందర్‌ రెడ్డి, మోహన్‌ పాల్గొన్నారు.


logo