శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mulugu - Sep 27, 2020 , 07:36:07

ములుగు జిల్లాలో 30.5 మిల్లీ మీటర్ల వర్షపాతం

ములుగు జిల్లాలో  30.5 మిల్లీ మీటర్ల వర్షపాతం

ములుగు కలెక్టరేట్‌ : ములుగు జిల్లాలో  శనివారం ఉదయం వరకు 30.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగులో 71.8 మిల్లీమీటర్లు, వాజేడులో 2.4 మి.మీ, వెంకటాపూర్‌ 39.4 మి.మీ, తాడ్వాయిలో 58 మి.మీ, గోవిందరావు పేట లో 33.4మి.మీ, ఏటూరునాగారంలో 26.0మి. మీ, వెంకటా పురం (నూగూరు) 3.6మి.మీ, మంగపేటలో 9.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.