శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mulugu - Sep 27, 2020 , 07:36:07

ఎల్‌ఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన

ఎల్‌ఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన

ములుగు, సెప్టెంబర్‌26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు ములుగు జిల్లాలో అనూహ్య స్పందన వస్తున్నదని డీఎల్‌పీవో దేవరాజు తెలిపారు. అనధికార లే ఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. శనివారం నాటికి  జిల్లా వ్యాప్తంగా 17 గ్రామ పంచాయతీల్లో 688 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.6లక్షల 88వేల ఆదాయం సమకూరినట్లు ఆయన చెప్పారు. logo