గురువారం 22 అక్టోబర్ 2020
Mulugu - Sep 24, 2020 , 05:41:25

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఏటూరునాగారం : ద్విచక్ర వాహనం (ఏపీ 37 ఏక్యూ 1387)పై వెళ్తూ ఈనెల 17న గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి ఎంజీఎంలో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఏటూరునాగారం నుంచి ముల్లకట్ట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి వాహనం అదుపుతప్పి కింద  పడగా గాయాలయ్యాయి. అతడిని మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. కాగా, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి బంధువులు ఎవరైనా గుర్తు పడితే వెంటనే ఏటూరునాగారం పోలీస్‌ స్టేషన్‌ నంబర్‌ 9440904630ను సంప్రదించాలని ఎస్సై తెలిపారు. 


logo