Mulugu
- Sep 24, 2020 , 05:41:25
బారికేడ్ల నిర్మాణం షురూ

ములుగు, సెప్టెంబర్23: జిల్లా కేంద్రంలో ఇటీవల చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేయనున్న బారికేడ్ల పనులు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. రెండు నెలల క్రితం పనులు ప్రారంభించిన సమయంలో వాటి ఏర్పాటును నిలిపివేయాలని వ్యాపారులు కలెక్టర్‌కు విన్నవించగా పనులు ఆగిపోయాయి. ప్రతి మూడు దుకాణాలకు ఒక ప్రవేశం ఏర్పాటు చేస్తూ పనులు ప్రారంభించాలని ప్రస్తుతం కలెక్టర్ ఆదేశించడంతో ఆ దిశగా పనులు జరుగుతున్నాయి.
ఇప్పటికీ కొందరు వ్యాపారస్తులు తమ షాపు ముందు ఎంట్రెన్స్ ఉండాలంటూ వర్కర్లతో గొడవకు దిగుతూ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బారికేడ్లను ఏర్పాటు చేస్తుండగా వ్యాపారస్తులు ఆటంకాలు కలిగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
MOST READ
TRENDING