శనివారం 31 అక్టోబర్ 2020
Mulugu - Sep 23, 2020 , 03:19:10

కేంద్రానిది అప్రజాస్వామిక నిర్ణయం

కేంద్రానిది అప్రజాస్వామిక నిర్ణయం

ములుగు, సెప్టెంబర్‌ 22 : కేంద్ర ప్రభుత్వ నిర్ణ యం అప్రజాస్వామికమైనదని, దీంతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్‌ సత్యనారాయణస్వామికి పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి అమ్జద్‌పాషా, నాయకులు నర్సింగ్‌, ప్రకాశ్‌, నటరాజ్‌, రాజయ్య, కుమ్మరి సాగర్‌, లక్ష్మి, రాజక్క పాల్గొన్నారు. 

గోవిందరావుపేటలో రాస్తారోకో 

గోవిందరావుపేట : మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి పులుగుజ్జు వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు పెద్దపీట వేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో చిట్టిబాబు, ఆదిరెడ్డి, రామస్వామి, సూర్యనారాయణ, లెనిన్‌, రమేశ్‌, సత్యనారాయణ, కన్నోజు సదానందం, మోహన్‌రెడ్డి, సమ్మిరెడ్డి, ధర్మారెడ్డి, ఆదిరెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు.

వాజేడులో నిరసన

వాజేడు: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమం లో దబ్బకట్ల లక్ష్మయ్య, గుగ్గిళ్ల దేవయ్య పాల్గొన్నారు.

బిల్లును రద్దు చేయాలి

వెంకటాపురం(నూగూరు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును రద్దు చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు గ్యానం వాసు, మండల కార్యదర్శి వంకా రాములు  డిమాండ్‌ చేశారు.  అనంతరం డీటీ రాముకు వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు చిట్టెం ఆదినారాయణ, గుండమల్లప్రసాద్‌, కట్లచారి, సున్నం నర్సింహారావు, జజ్జరి దామోదర్‌, తోట నాగేశ్వరావు పాల్గొన్నారు.