శనివారం 31 అక్టోబర్ 2020
Mulugu - Sep 22, 2020 , 02:53:18

తొలిదశ ఉద్యమ ఊపిరి లక్ష్మణ్‌ బాపూజీ

తొలిదశ ఉద్యమ ఊపిరి లక్ష్మణ్‌ బాపూజీ

ములుగు, సెప్టెంబర్‌ 21: తెలంగాణ తొలిదశ ఉద్య మానికి ఊపిరిలూదిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్‌బాపూజీ అని జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమం కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయం గా వదిలేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం బలోపేతానికి బాపూజీ చేసిన కృషి మరువలేనిదన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్‌యాదవ్‌, ములు గు, వెంకటాపూర్‌ మండలాల అధ్యక్షులు బాదం ప్రవీణ్‌, కూరెళ్ల రామాచారి, సీనియర్‌ నాయకుడు రమే శ్‌, పట్టణ అధ్యక్షుడు మేరుగు సంతోష్‌యాదవ్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క, పద్మశాలి భవన్‌లో బాపూజీ చిత్రపటానికి డీపీ జనార్దన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. 

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. వెంకటాపూర్‌ మండలం చాతరాజుపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కరీమాబీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా టీఆర్‌ఎస్‌ పార్టీ క్రీయాశీల సభ్యత్వం ద్వారా ఆమెకు మంజూరైన రూ.2లక్షల చెక్కును మృతురాలి కుటుంబానికి అందజేశారు. అనం తరం మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం లో పార్టీ ముందుంటుందన్నారు. క్రియాశీల, సాధారణ సభ్యత్వాలు పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు భరో సా నింపేందుకు ఈ బీమా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్రరజిత సమ్మయ్య, జడ్పీటీసీ రుద్రమదేవి, డీసీసీబీ డైరెక్టర్‌ మాడుగుల రమేశ్‌,  నరేంద్రాచారి, నాయకులు తదిత రులు పాల్గొన్నారు. 

సఖీ హెల్ప్‌లైన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ 

ములుగురూరల్‌: జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ జగదీశ్వర్‌, సీఈవో పారిజాతంతో కలిసి సఖీ హెల్ప్‌లైన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 181హెల్ప్‌లైన్‌తో గృహహింస, లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలు, బాలికలకు రక్షణ, న్యాయ, వైద్య సహాయం అందిస్తారన్నారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీసీపీవో ఓంకార్‌, నిర్వాహకులు పాల్గొన్నారు.