మంగళవారం 20 అక్టోబర్ 2020
Mulugu - Sep 21, 2020 , 06:05:01

మద్యం వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి

మద్యం వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట  వేయాలి

ములుగు,సెప్టెంబర్‌20: జిల్లా కేంద్రంలోని మద్యం వ్యాపారుల అక్రమాలు మితిమీరుతున్నాయని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దొంతి వాసుదేవారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అధిక రేట్లకు మద్యం విక్రయిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మద్యాన్ని బెల్ట్‌ షాపులకు తరలిస్తున్నారని, మద్యం షాపుల్లో నిల్వలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

కరోనా సమయంలో అధికారులు నామమాత్రంగా షాపులు సీజ్‌ చేశారని, ఆ సమయంలో షాపుల వెనుక నుంచి మద్యం తరలించిన వారిపై ఇంత వరకూ చర్యలు చేపట్టలేని అన్నారు. నిబంధనలు పాటించని మద్యం షాపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్‌యాదవ్‌, జిల్లా కోశాధికారి కొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్‌, మండల ఉపాధ్యక్షుడు బైకాని రాజశేఖర్‌యాదవ్‌, నాయకులు సురేందర్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 


logo